రెహమాన్‌లాగే అలాగే హిట్ కొడతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
డబుల్ ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న తరువాత కూడా ఎ.ఆర్.రెహమాన్ కెరీర్‌లో ఓ వెలితి ఉండేది. అదేమిటంటే.. తెలుగులో ఆయన నేరుగా చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదన్నది. అయితే.. సరిగ్గా ఓ సంవత్సరం తరువాత ఆ లోటు తీరింది. ఏమాయ చేసావే రూపంలో ఆయనకి తెలుగులో తొలి హిట్ దొరికింది. ఇది ఓ ద్విభాషా చిత్రం.
కట్ చేస్తే.. అదే సమస్య మరో సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్‌ని వెంటాడుతోంది. వాసుతో మొదలుపెట్టి ఘర్షణ, మున్నా, సైనికుడు, ఆరెంజ్.. ఇలా హేరిస్ చేసిన ఏ తెలుగు సినిమా కూడా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు.
మళ్లీ చాన్నాళ్ల తరువాత స్పైడర్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం తెరకెక్కింది. అంటే.. ద్విభాషా చిత్రం అన్నమాట. మరి ఎ.ఆర్.రెహమాన్‌లాగే హేరిస్ కి కూడా ద్విభాషా చిత్రం రూపంలోనే తెలుగునాట తొలి విజయం రాసి పెట్టి ఉందేమో! మహేష్ హీరోగా మురుగదాస్ రూపొందించిన స్పైడర్ ఈ నెల 27న దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout