రెహ‌మాన్‌లాగే అలాగే హిట్ కొడ‌తాడా?

  • IndiaGlitz, [Monday,September 11 2017]

డ‌బుల్ ఆస్కార్ అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న త‌రువాత కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ కెరీర్‌లో ఓ వెలితి ఉండేది. అదేమిటంటే.. తెలుగులో ఆయ‌న నేరుగా చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేద‌న్న‌ది. అయితే.. స‌రిగ్గా ఓ సంవ‌త్స‌రం త‌రువాత ఆ లోటు తీరింది. ఏమాయ చేసావే రూపంలో ఆయ‌న‌కి తెలుగులో తొలి హిట్ దొరికింది. ఇది ఓ ద్విభాషా చిత్రం.

క‌ట్ చేస్తే.. అదే స‌మ‌స్య మ‌రో సంగీత దర్శ‌కుడు హేరిస్ జైరాజ్‌ని వెంటాడుతోంది. వాసుతో మొద‌లుపెట్టి ఘ‌ర్ష‌ణ‌, మున్నా, సైనికుడు, ఆరెంజ్‌.. ఇలా హేరిస్ చేసిన ఏ తెలుగు సినిమా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

మ‌ళ్లీ చాన్నాళ్ల త‌రువాత స్పైడ‌ర్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఈ చిత్రం తెర‌కెక్కింది. అంటే.. ద్విభాషా చిత్రం అన్న‌మాట‌. మ‌రి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌లాగే హేరిస్ కి కూడా ద్విభాషా చిత్రం రూపంలోనే తెలుగునాట తొలి విజ‌యం రాసి పెట్టి ఉందేమో! మ‌హేష్ హీరోగా మురుగ‌దాస్ రూపొందించిన స్పైడ‌ర్ ఈ నెల 27న ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

More News

తాగుబోతుగా విజయ్ ఆంటోని?

నకిలీ,డా.సలీం,బిచ్చగాడు,బేతాళుడు,యమన్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోని..

శ్రీవల్లి అందుకు వేదిక కావడం గర్వంగా వుంది: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మగధీర రూపంలో కెరీర్ లో రెండో సినిమాతోనే మర్చిపోలేని విజయాన్ని నాకు అందించారు రాజమౌళి,విజయేంద్రప్రసాద్.

మృణాళినిగా నయన్

కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది నయనతార.

రెండో పాట‌తోనూ అల‌రించిన థ‌మ‌న్‌

యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. నాగార్జున రాజుగారి గ‌ది 2, శ‌ర్వానంద్ మ‌హానుభావుడు, విక్ర‌మ్ స్కెచ్‌, అనుష్క భాగ్‌మ‌తి, సాయిధ‌ర‌మ్ తేజ్ జ‌వాన్ చిత్రాలు ఆయ‌న ఖాతాలోనే ఉన్నాయి. వీటిలో ముందుగా మ‌హానుభావుడు చిత్రం తెర‌పైకి రానుంది. 

రీమేక్‌లో నిఖిల్ హీరోయిన్స్‌

గ‌తేడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా. నిఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హెబ్బా ప‌టేల్‌, నందితా శ్వేత‌, అవికా గోర్ హీరోయిన్స్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.