సూర్య‌కి క‌లిసొచ్చిన‌ట్టే కార్తికి క‌లిసొస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,June 05 2018]

ఒకప్పుడు ఎన్టీఆర్ - చక్రవర్తి, ఏఎన్నార్ – కె.వి.మహదేవన్.. కాంబినేష‌న్‌లో పాటలంటే అవి గ్యారంటీగా హిట్ అనే న‌మ్మ‌కం ఉండేది. ఇక ఆ తర్వాత కాలంలో కృష్ణ - చక్రవర్తి, చిరంజీవి - ఇళయరాజా, నాగార్జున – కీరవాణి కాంబినేషన్స్‌లో పాటలు ఎంత పెద్ద హిట్టో వేరేగా చెప్ప‌న‌క్కర‌లేదు.

అయితే.. ఇప్పుడున్న‌ పరిస్థితుల్లో హీరో – మ్యూజిక్ డైరెక్టర్ హిట్ కాంబినేషన్ అన్న‌ది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి అరుదైన కలయికే సూర్య – హారిస్ జయరాజ్‌ది. వీరి కలయిక 'కాక్క కాక్క‌' (తెలుగులో 'ఘర్షణ')తో మొదలై.. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'వీడొక్కడే', 'ఘటికుడు', '7th సెన్స్', 'బ్రదర్స్', 'ఎస్-3' వరకు విజయవంతంగా కొనసాగింది.

ఇక సూర్య కెరీర్‌లో 37వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాకి కూడా హారిస్ జయరాజ్ సంగీతం అందించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సూర్య సోదరుడు కార్తి హీరోగా నటిస్తున్న 'దేవ్' చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మరి కార్తి సినిమాకి తొలిసారి సంగీతాన్ని అందిస్తున్న హారిస్ జయరాజ్.. అన్న సూర్య లాగే త‌మ్ముడు కార్తికి కూడా మంచి సక్సెస్‌ఫుల్ మ్యూజికల్ ఆల్బమ్‌ని రూపొందిస్తారేమో చూడాలి.

More News

మరోసారి స్టూడెంట్‌గా మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సైరా.. ఆ వ‌రుస‌లో చేరుతుందా?

మెగాస్టార్ చిరంజీవికి స‌మ్మ‌ర్ సీజ‌న్ బాగా క‌లిసొచ్చిన సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో ఆయ‌న న‌టించిన పలు చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి.

'రంగస్థలం' సింగర్ తో 'శంభో శంకర' పాట

నాన్ '"బాహుబలి-2'" రికార్డులు తిరగ రాసిన చిత్రం "రంగస్థలం"  ఈ సినిమా కి ప్రాణంగా  నిలిచిన " రంగా రంగస్థలనా"

అతిథి పాత్ర‌తో హ్యాట్రిక్ కొడుతుందా?

'మ‌హాన‌టి'తో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు.. ఆమెకు న‌టిగా మంచి గుర్తింపును తీసుకువ‌చ్చింది.

'చినబాబు' టీజర్ కు అద్భుతమైన స్పందన

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం  కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది.