నానితోనైనా బ్రేక్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
క్లాసిక్ చిత్రాల టైటిల్స్ ని మరోసారి వాడుకోవడం సాధారణమైపోయిన రోజులివి. సినిమా బాగుంటే సరి, లేదంటే అప్రతిష్ట పాలవ్వాల్సిందే అన్నట్లుగా ఉంటుంది ఇలాంటి టైటిల్స్ పెట్టుకుంటే. 'అష్టా చమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు ఆ తరువాత' చిత్రాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి ది కూడా ఇదే పరిస్థితి.
సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'మాయాబజార్', 'బందిపోటు' చిత్రాల పేర్లను వినియోగించుకుంటూ తీసిన రెండు చిత్రాలూ అతనికి పరాజయాలే మిగిలిచ్చాయి. ఈ నేపథ్యంలో నానితో తీస్తున్న 'జెంటిల్ మ్యాన్'తోనైనా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. అర్జున్ హీరోగా శంకర్ రూపొందించిన తమిళ అనువాద చిత్రం 'జెంటిల్ మేన్' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే టైటిల్‌తో పోసాని హీరోగా వచ్చిన చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com