పవన్ ఆహ్వానం మన్నించి ఆయన జనసేనలోకి వస్తారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా వార్త పత్రికలు, టీవీ చానెళ్లు చూసే వారికి పరిచయం అనవసరం. ఈయన వార్త పత్రికల్లో ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు ఎక్కువ రాస్తుంటారు. ఒకానొక సందర్భంగా జనసేనపై పుల్లారావు రాసిన ఎడిటోరియల్‌కు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫిదా అయిపోయారు. దీంతో మీ లాంటి వ్యక్తులే మా పార్టీకి కావాలి సర్ అని పవన్ ఆయన్ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పవన్ స్పష్టం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పెంటపాటి రాస్తున్న కథనాలు విశ్లేషణాత్మకంగా, ఆలోచింపజేసేలా ఉన్నాయని పవన్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
భేటీలో ఇద్దరూ కలిసి..!
"ఓసారి నేను పుల్లారావును కలుసుకున్నాను. మేమిద్దరం కొన్ని గంటల పాటు ఒకరి ఆలోచనలను మరొకరం పంచుకున్నాము. జనసేన లాంటి కొత్త పార్టీకి పుల్లారావు లాంటి అనుభవం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వం అవసరముంది. జనసేనలో చేరాల్సిందిగా నేను పుల్లారావును ఒప్పించాను. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాను" అని పవన్ చెప్పుకొచ్చారు. అయితే పెంటపాటి జనసేన తీర్థం పుచ్చుకుంటారా లేకుంటే తన జర్నలిజం జీవితాన్నే కొనసాగిస్తారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments