హారీష్ పాత‌క‌థ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

  • IndiaGlitz, [Friday,September 11 2015]

హారీష్ శంక‌ర్..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో విజ‌యం సాధించడంతో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ సినిమా పై చిరు చేసిన కామెంట్స్ ఆలోచ‌న‌లో ప‌డేసాయి.

ఇంత‌కీ చిరు చేసిన కామెంట్స్ ఏమిటంటే....సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం ఆడియో ఫంక్ష‌న్ లో మెగాస్టార్ ఈ సినిమా గురించి స్పందిస్తూ...ఈ సినిమా క‌థ పూర్తిగా తెలియ‌దు కానీ...నేను న‌టించిన మొగుడు కావాలి, బావ‌గారు బాగున్నారా..? సినిమాల్లా సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఉంటుంద‌ని విన్నాను అని చెప్పారు. చిరు చెప్పిన దానిని బ‌ట్టి చూస్తుంటే...సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ కొత్త క‌థ కాదు పాత క‌థే అనిపిస్తుంది. మ‌రి..ఇదే క‌నుక నిజ‌మైతే....హారీష్ శంక‌ర్ పాత‌క‌థ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..? లేదా..? తెలియాలంటే ఈ నెల 24 వ‌ర‌కు ఆగాల్సిందే.