'హరికథ' మరో 'రెడీ' అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'దేవదాసు', 'రెడీ', 'కందిరీగ'.. ఇవీ హీరో రామ్ కెరీర్‌లో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్ మూవీస్. 'కందిరీగ' తరువాత సరైన విజయం లేని రామ్‌కి ఈ ఏడాది వేసవిలో వచ్చిన 'పండగ చేస్కో' ఫరవాలేదనిపించే ఫలితాన్ని అయితే ఇచ్చింది కానీ హిట్‌ని మాత్రం అందించలేకపోయింది. ఇక తాజాగా విడుదలైన 'శివమ్' గురించైతే నో కామెంట్స్. ఈ నేపథ్యంలో రామ్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'హరికథ'పై అందరి దృష్టి పడింది. కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అనే అంశం ఏదైతే ఉందో.. అది సెంటిమెంట్ పరంగా రామ్‌కి కలిసొస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నారు. అదెలాగంటే.. ఏడెనిమిదేళ్ల క్రితం 'జగడం', 'రెడీ'.. ఇలా రామ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కోసం దేవి మ్యూజిక్ అందిస్తే.. మొదటిది డిజాస్టర్ కాగా.. రెండోది సూపర్‌హిట్ అయ్యింది.
కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు రామ్‌తో దేవి పనిచేస్తున్నాడు. అదీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కోసం కావడం గమనార్హం. అందులో మొదటిది 'శివమ్' ఇటీవలే రిలీజైంది. ఫలితం తెలిసిందే. ఇక రెండో చిత్రమైన 'హరికథ' సెంటిమెంట్ ప్రకారం హిట్ అవ్వాల్సి ఉంది. అన్నట్లు.. అటు 'రెడీ'గానీ.. ఇటు 'హరికథ' కానీ స్రవంతి మూవీస్ వారి చిత్రాలే కావడం కొసమెరుపు. 'హరికథ'ది విజయగాథ కావాలని ఆశిద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments