'హ‌రిక‌థ' మ‌రో 'రెడీ' అవుతుందా?

  • IndiaGlitz, [Tuesday,October 06 2015]

'దేవ‌దాసు', 'రెడీ', 'కందిరీగ‌'.. ఇవీ హీరో రామ్ కెరీర్‌లో నిలిచిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌. 'కందిరీగ' త‌రువాత స‌రైన విజ‌యం లేని రామ్‌కి ఈ ఏడాది వేస‌విలో వ‌చ్చిన 'పండ‌గ చేస్కో' ఫ‌ర‌వాలేద‌నిపించే ఫ‌లితాన్ని అయితే ఇచ్చింది కానీ హిట్‌ని మాత్రం అందించ‌లేక‌పోయింది. ఇక తాజాగా విడుద‌లైన 'శివ‌మ్' గురించైతే నో కామెంట్స్‌. ఈ నేప‌థ్యంలో రామ్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'హ‌రిక‌థ‌'పై అంద‌రి దృష్టి ప‌డింది. కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అనే అంశం ఏదైతే ఉందో.. అది సెంటిమెంట్ ప‌రంగా రామ్‌కి క‌లిసొస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నారు. అదెలాగంటే.. ఏడెనిమిదేళ్ల క్రితం 'జ‌గ‌డం', 'రెడీ'.. ఇలా రామ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కోసం దేవి మ్యూజిక్ అందిస్తే.. మొద‌టిది డిజాస్ట‌ర్ కాగా.. రెండోది సూప‌ర్‌హిట్ అయ్యింది.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు రామ్‌తో దేవి ప‌నిచేస్తున్నాడు. అదీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కోసం కావ‌డం గ‌మ‌నార్హం. అందులో మొద‌టిది 'శివ‌మ్' ఇటీవ‌లే రిలీజైంది. ఫ‌లితం తెలిసిందే. ఇక రెండో చిత్ర‌మైన 'హ‌రిక‌థ' సెంటిమెంట్ ప్ర‌కారం హిట్ అవ్వాల్సి ఉంది. అన్న‌ట్లు.. అటు 'రెడీ'గానీ.. ఇటు 'హ‌రిక‌థ' కానీ స్ర‌వంతి మూవీస్ వారి చిత్రాలే కావ‌డం కొస‌మెరుపు. 'హ‌రిక‌థ‌'ది విజ‌య‌గాథ కావాలని ఆశిద్దాం..

More News

సాలిడ్ హిట్ కోసం రెచ్చిపోయిన ర‌కుల్‌

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ సాలిడ్ హిట్ కోసం తెగ ఆరాట‌ప‌డుతోంది.

నిత్యామీనన్ అండ్ స్టార్ హీరోస్

అందాల ప్రదర్శన కంటే అభినయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నిత్యా మీనన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.నిన్న మొన్నటివరకు తన పాత్రకే ఇంపార్టెన్స్ ఇస్తూ..

చెర్రీ , బన్నిల పోటాపోటీ

'ఎవడు'కోసం కలిసి నటించి మెగా అభిమానులను అలరించారు మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్,అల్లు అర్జున్.ఆ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలేమీ లేకపోయినా..

రానాకి ఈసారైనా కలిసొచ్చేనా?

'బాహుబలి'తో ఫుల్ఫామ్ లోకి వచ్చేసాడు రానా.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా భళ్లాల దేవ పాత్రతో అభిమానులను సంపాదించుకున్నాడు

12 ఏళ్ల తరువాత బరిలోకి బాబాయ్,అబ్బాయ్

2016 సంక్రాంతి రసవత్తరంగా మారింది.ఎందుకంటే..