‘భూమండలంలో ఎవరి దగ్గర లేని ఆయుధాలు ఇండియాకు ఇస్తా’
Send us your feedback to audioarticles@vaarta.com
రక్షణ ఒప్పందాల్లో భాగంగా మా మిత్ర దేశం భారత్‌కు ఈ భూమండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలని అనుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. మేమిచ్చే ఆయుధాలు మరెవరూ తయారుచేయలనంత గొప్ప ఆయుధాలని.. వాటిని మేం తప్ప ఎవరూ తయారు చేయలేరని చెప్పారు. ఇప్పుడు వాటి విషయంలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్‌తో తమ బంధం మరింత బలోపేతం అవుతోందని ట్రంప్ అన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్, అమెరికాది ఒకే సిద్ధాంతమన్నారు.
మీకు ధన్యవాదాలు!
‘ప్రపంచవ్యాప్తంగా తమ కూటములు మరింత విస్తరిస్తున్నాయి. రేపు మంగళవారం భారత్ తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటాం. అమెరికా, భారతదేశాలు రెండు అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం రెండు దేశాలను ఏకం చేస్తోంది. నా పరిపాలనలో అమెరికా సైన్యం పూర్తి శక్తిసామర్ధ్యాలు ఉపయోగించి రక్తపిపాసులైన ఐఎస్ఐఎస్ నరహంతకులని మట్టుబెట్టాం. ఐఎస్ఐఎస్ అధీనంలోని మొత్తం ప్రాంతం నాశనమైంది. కర్కోటకుడు అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఇక ప్రతి దేశం తనకు సురక్షితమైన సరిహద్దులు ఉండాలని కోరుకుంటుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను రూపుమాపేందుకు పాకిస్థాన్‌తో మేం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నాం. పాక్‌తో మా సంబంధాలు సజావుగానే ఉన్నాయి. మా సుదీర్ఘ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటి పట్ల మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. అధ్భుతమైన అతిథ్యమిచ్చిన మీకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout