అమ్మాయికి మంచి జీవితాన్ని ఇస్తా...
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మోహన్ బాబు పుట్టినరోజు నేడు. ఈ రోజును పురస్కరించుకుని ఆయన రెండో తనయుడు మంచు మనోజ్ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. సిరిసిల్ల గ్రామానికి చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు.
ఈ విషయాన్ని మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. "అశ్వితకు కలెక్టర్ కావడమే ఆశయం. ఆమెను విద్యానికేతన్ చేర్పించాను. మంచి చదువు చెప్పిస్తాను. కలెక్టర్ కావడానికి నా వంతు బాధ్యతను నిర్విర్తిస్తాను.
మంచి జీవితాన్ని ఆమెకు అందిస్తాను" అని కూడా ఈ సందర్భంగా మనోజ్ తెలిపారు. ఇలాంటి ఓ మంచి పని చేసినందుకు గర్వంగా ఉందని కూడా తెలిపారు. నేడు మంచు మోహన్ బాబు తన 69వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు.
Nana’s bday 2mrw & turned 2 be my best! I take pride in #adopting #Ashwitha frm #Sirisilla. Enrolled her 2day at @IVidyanikethan. I hereby, take up all her responsibilities 2 support, educate & ensure her safety & desire to become an #IAS officer!Tq all who helped!❤️#JoyOfGiving pic.twitter.com/31ASlnXIl2
— MM*????❤️ (@HeroManoj1) March 18, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments