పూరీకి ఈసారైనా కలిసొస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సంగీత దర్శకుడు సందీప్ చౌతా. ఆ తర్వాత ‘చంద్రలేఖ’, ‘ప్రేమకథ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందించారు. మధ్యలో వేరే భాషల మీద దృష్టి పెట్టడంతో తెలుగు సినిమాలకు దూరమయ్యారు. ఆ నేపథ్యంలో.. కొంత కాలం విరామం తర్వాత ఈయన సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సూపర్’. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా మెప్పించకపోయినా.. ఆడియో మాత్రం సంచలనం సృష్టించింది.
మళ్ళీ పూరి, సందీప్ కాంబినేషన్లో 2008లో ‘బుజ్జిగాడు’ సినిమా వచ్చింది. ఇది కూడా గత చిత్రం మాదిరిగానే కమర్షియల్గా విజయం సాధించకపోయినా.. ఆడియో పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కట్ చేస్తే.. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ ‘మెహబూబా’. తాజాగా విడుదలైన ఈ మూవీలోని పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్గా విజయం సాధించలేదు. మరి ‘మెహబూబా’ అయినా వీరికి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో పూరి తనయుడు పూరి ఆకాష్, నేహా శెట్టి జంటగా నటించారు. ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com