టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరితొ సినిమాలు చేస్తాం - అల్లు అరవింద్
Send us your feedback to audioarticles@vaarta.com
గీతాఆర్ట్స్ బ్యానర్‌లో చాలా మంది కొత్త దర్శకుల్ని, నటీనటుల్ని పరిచయం చేశారు. గీతాఆర్ట్స్ నిర్మాణ సంస్థలో న్యూటాలెంట్ ని ప్రోత్సహించటం మెదటి నుండి వస్తున్న సాంప్రదాయమే. అయితే అంచెఅంచెలుగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రోడక్షన్ హౌస్ కావటంతో బడ్జెట్ లిమిటేషన్స్ తో భారీ చిత్రాలు నిర్మించటం జరుగుతుంది. కాని మీడియం చిత్రాలు కూడా నిర్మించాలని నిర్మాత అల్లు అరవింద్ గారు భావించి గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్ధ జిఏ2 గా మరో సంస్ధని స్ధాపించి బన్నివాసు కి నిర్మాణ భాద్యతలు అప్పగించారు. ఈ బ్యానర్‌లో భలేభలేమగాడివోయ్ లాంటి సూపర్‌హిట్ ని నిర్మించారు. ఆ తరువాత టాలీవుడ్ రాక్‌స్టార్ విజయ్‌దేవరకొండ హీరోగా మరో రెండు చిత్రాలు ప్రారంభించారు. ఇప్పడు మరో అడుగు ముందుకేసి సక్సస్‌ఫుల్ యంగ్ నిర్మాతలు వంశి, ప్రమెద్, విక్కి, జ్ఙానవేల్ రాజా లాంటి టాలెంటెడ్ నిర్మాతలతో వి4 అనే నూతన నిర్మాణ సంస్థ ని స్థాపించారు. ఈ సంస్థలో ప్రోడక్షన్ నెం1 గా టాలెంటెడ్ దర్శకుడు ప్రభాకర్ ని సిల్వర్‌స్క్రీన్ కి పరిచయం చేస్తున్నారు. ఈ నిర్మాణ సంస్ధ లో మేజర్ గా కాన్స్‌ప్ట్ చిత్రాలకి ప్రాధాన్యతనివ్వనున్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - సినిమా ఏ జోనర్ అయినా ప్రేక్షకుడ్ని ఎంటర్‌టైన్ చేయ్యటమే సినిమా లక్ష్యం. వేలాదిమంది రాత్రింభవళ్ళు కష్టపడేది ప్రేక్షకుడ్ని రెండున్నర గంటలు భావోద్వేగంలో వుంచడాని మాత్రమే. మేము గీతాఆర్ట్స్ లో చిత్రాలు తీయటం స్టార్ట్ చేసినప్పటికి ట్రెండ్ వేరు. ఇప్పడు యంగ్‌స్టర్ ఆలోచన వేరు. ఏట్రెండ్ లో వున్నా యువత కి నచ్చే చిత్రాలు తీస్తూనే వచ్చాము. మా సంస్ధలో చాలా మంది హీరోల్ని పరిచయం చేశాము. కాకపోతే వారిలో మా ఫ్యామిలి మెంబర్స్ నే ఎక్కువుగా వున్నారు. రీసెంట్ గా అబ్జర్వ్ చేస్తే యూత్ అంతా కాన్సెప్ట్ చిత్రాల వైపు బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే తమిళంలో కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తెలుగు కాన్సెప్ట్ సినిమాలను ఆదరించడానికి జనం, ఈ యంగ్ జనరేషన్ ఆసక్తిని చూపిస్తున్నా పెద్దగా రావడం లేదని ఓ సారి బన్ని వాసు నేను చర్చించుకున్నాం. మనం ఎందకు కాన్సెప్ట్ చిత్రాలు చెయ్యకూడదు అనే ప్రశ్నకి పునాది వి4 మూవీస్. అప్పుడు వంశి, ప్రమెద్, విక్కి, జ్ఞానవేల్ రాజా లు కూడా ఈ కాన్సెప్ట్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ భాద్యతని బన్నివాసు కి అప్పగించాము. ఓ ముఖ్యమైన విషయం ఓ మంచి కాన్సెప్ట్ తో వస్తే మా ఫ్యామిలి హీరోలతోనే కాదు ఎవరితోనైనా సినిమా చేస్తాము. అని అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments