మహేష్, విజయ్ తో సినిమా చేస్తా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్.. 11 ఏళ్ల తరువాత రూపొందించిన తెలుగు చిత్రం స్పైడర్. సూపర్ స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీతమందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే సారి విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో మహేష్, విజయ్‌తో మణిరత్నం ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు? అది వర్కవుట్ కాలేదు. మీకు అలాంటి ఆలోచన ఉందా? అని అడిగితే.. సబ్జెక్ట్ కుదిరితే తప్పకుండా ఈ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. మరి మహేష్, విజయ్ ఒకే సినిమాలో కనిపిస్తే.. ఆ సినిమాకి రెండు భాషల్లో ఉండే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com