సీమను 'సౌభాగ్య రాయలసీమ' గా అభివృద్ధి చేస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు నివారించేందుకు జనసేన ప్రభుత్వం వచ్చాక సౌభాగ్య రాయలసీమ పథకాన్ని అమలు చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సీమను సౌభాగ్యవంతంగా అభివృద్ధి చేస్తామనీ.. ఇందుకు సంబంధించి దశాబ్ద కాలానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. అనంతపురం జిల్లాను అత్యంత వెనకబడిన జిల్లాగా గుర్తించినా, అభివృద్దికి ఎవరూ పైసా ఇచ్చింది లేదన్నారు. జనసేన ఎన్నికల శంఖారావంలో భాగంగా ధర్మవరం, అనంతపురంలలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. "రూ.50 వేల కోట్లతో రాయలసీమకి పెట్టుబడులు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. యువత ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా నివారించి, ఇక్కడే అవకాశాలు కల్పిస్తాం. ఇంటి దగ్గరే ఉండి తల్లిదండ్రుల్ని చూసుకోవచ్చు. ఇక బిడ్డల వలసల కారణంగా ఒంటరిగా మిగిలిన పెద్దలను చూసుకునేందుకు మండలానికి ఒక్కటి చొప్పున ప్రభుత్వం నుంచి ఆదరణ నిలయాలు ఏర్పాటు చేస్తాం. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలన్న కోరిక ఉన్నా, జనసైనికులు ఉన్నంత అండగా నాయకులు నా పక్కన లేరు
ఆ స్థాయిలో నాయకులు నాకు అండగా ఉండి ఉంటే ఇక్కడి నుంచి పోటీ చేసి ఉండేవాడిని. కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా. ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చినప్పుడు, స్థానికంగా నియోజకవర్గాన్ని చూసుకునే నాయకులు అవసరం ఉంది. రాయలసీమని ఇప్పటి వరకు వచ్చిన మరే ముఖ్యమంత్రి అభివృద్ది చేయని స్థాయిలో అభివృద్ధిపరుస్తాం. అనంతపురం జిల్లాని దత్తత తీసుకుని మరీ అభివృద్ది చేస్తాము. ప్రతి నియోజకవర్గంలో చీఫ్ మినిస్టర్ కమాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, సచివాలయం నుంచి ఇక్కడ జరిగే అభివృద్దిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం" అని జిల్లా ప్రజలకు పవన్ భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout