అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర‌తో పాటు నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో చిరు సోద‌రి పాత్ర ఒక‌టి. ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనేది సినీ వ‌ర్గాల్లో చర్చ‌గా మారింది. చాలా మంది హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డాయి. తాజా సమాచారం మేరకు నయనతారకు నటింప చేస్తే ఉంటుంద‌ని మేక‌రస్్ ఆలోచన‌లు చేస్తున్నార‌ట‌. అయితే ఇక్క‌డొక చిక్కొచ్చి ప‌డింది.

అదేంటంటే చిరంజీవి 151వ చిత్రం సైరా న‌రసింహారెడ్డిలో హీరోయిన్‌గా న‌టించిన న‌య‌న‌తార మ‌రోసారి చిరంజీవి చిత్రంలో అది కూడా ఆయ‌న సోద‌రి పాత్ర‌లో న‌టిస్తుందా? అని. ఒక‌వేళ ఆమె ఒప్పుకున్న మెగా ఫ్యాన్స్ న‌య‌న‌తారను చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో అంగీక‌రిస్తారా? అనేది మెగా క్యాంప్‌లో క‌ల‌వ‌ర‌పెట్టే అంశ‌మే. అయితే ఇందులో ఏదీ ఫైన‌ల్ కాలేదు. త‌మిళ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడు మోహ‌న్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆచార్య సినిమా పూర్తి కాగానే.. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి బైరెడ్డి అనే టైటిల్‌ను అనుకుంటున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

డైరెక్టర్ క్రిష్‌కు కరోనా పాజిటివ్.. పవన్‌తో షూటింగ్ క్యాన్సిల్..

సినీ ప్రముఖులంతా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిందనగానే ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కాస్త రిలాక్స్ అయిపోయారు.

తేజకు అలివేలు దొరికింది.. కానీ..!

డైరెక్ట‌ర్ తేజ ఒకేసారి రెండు సినిమాల‌ను అనౌన్స్‌చేశాడు. అందులో ఓ చిత్రం ‘అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’.

సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు..

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా శనివారం ఆసుపత్రిలో చేరారు.

నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌'కు భారీ డీల్‌.. థియేటర్స్‌కు షాక్‌..!

కింగ్‌ నాగార్జున టైటిల్‌ పాత్రలోనటిస్తోన్న చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బండీ ఏంటిది.. ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్?

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముఖ్యంగా రెండు పార్టీల్లో ఊహించని మార్పులకు కారణమయ్యాయి.