అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర‌తో పాటు నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో చిరు సోద‌రి పాత్ర ఒక‌టి. ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనేది సినీ వ‌ర్గాల్లో చర్చ‌గా మారింది. చాలా మంది హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డాయి. తాజా సమాచారం మేరకు నయనతారకు నటింప చేస్తే ఉంటుంద‌ని మేక‌రస్్ ఆలోచన‌లు చేస్తున్నార‌ట‌. అయితే ఇక్క‌డొక చిక్కొచ్చి ప‌డింది.

అదేంటంటే చిరంజీవి 151వ చిత్రం సైరా న‌రసింహారెడ్డిలో హీరోయిన్‌గా న‌టించిన న‌య‌న‌తార మ‌రోసారి చిరంజీవి చిత్రంలో అది కూడా ఆయ‌న సోద‌రి పాత్ర‌లో న‌టిస్తుందా? అని. ఒక‌వేళ ఆమె ఒప్పుకున్న మెగా ఫ్యాన్స్ న‌య‌న‌తారను చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో అంగీక‌రిస్తారా? అనేది మెగా క్యాంప్‌లో క‌ల‌వ‌ర‌పెట్టే అంశ‌మే. అయితే ఇందులో ఏదీ ఫైన‌ల్ కాలేదు. త‌మిళ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ మోహ‌న్ త‌న‌యుడు మోహ‌న్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆచార్య సినిమా పూర్తి కాగానే.. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి బైరెడ్డి అనే టైటిల్‌ను అనుకుంటున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.