బాబు శ్రీ భరత్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా?

  • IndiaGlitz, [Sunday,September 01 2019]

టిడిపి... ఏపీలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి.. వైసిపి చేతిలో చావు దెబ్బను చవి చూసింది. కేవలం 23 స్థానాలకు పరిమితం అయి చరిత్రలో ఎరుగని ఓటమిని మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలంటే... టిడిపి వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే సాధ్యం అని అభిప్రాయడ్డారు అందరూ. కానీ... అసలు ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేనే లేదు అంటూ వార్తల్లో నిలిచారు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా అభ్యర్థి, బాలకృష్ణ మేనల్లుడు శ్రీ భరత్. దీంతో భారీగానే విమర్శలు ఎదుర్కున్నాడు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి సాహసోపేత వ్యాఖ్యలు చేసిన శ్రీ భరత్ కు మరి ఆ సత్తా ఉందా అనేది రాజకీయ వర్గాల్లో టాపిక్. బాబు పార్టీ పగ్గాలు అప్పగిస్తే సమర్ధవతంగా పార్టీని నడిపించగలడా అనేది ఇప్పుడున్న చర్చ.

గీతం విద్యా సంస్థల వ్యవస్థాపకుడు, రాజకీయ నాయకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడు, కావూరి సాంబశివరావు కూతురు కొడుకు అయిన శ్రీ భరత్ కు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. పైగా బాలయ్య మేనల్లుడు కూడా. అంతే కాదు.. ఇప్పుడున్న అధికార పార్టీ వైసీపీ పై విమర్శలు చేయడంలోనూ సిద్ధహస్తుడు. అటు బాబు కొడుకు లోకేష్ ని చూస్తే కాస్త పరిణతి తగ్గినట్లుగా ఉంటాడు. లోకేష్, శ్రీ భరత్ లు ఇద్దరు బాలయ్యకు అల్లుళ్ళు కాగా... వీరిద్దరినీ చూస్తే శ్రీ భరత్ కు పార్టీ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి భరత్ కు ఛాన్స్ ఇస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందా ? జూనియర్ ఎన్టీఆర్ అవసరం నిజంగానే లేదా? అనే చర్చలు జోరందుకున్నాయి.

ఒకవేళ వారసత్వం ప్రకారం లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అనుకున్నా గాని... లోకేష్ పరిణతి చెందెలోపు ... శ్రీ భరత్ తన సత్తా చూపిస్తాడు అని అనుకుంటున్నారు అంతా. మరి దీనికి నందమూరి అభిమానులు సై అంటారా? లేక జూనియర్, లోకేష్ లు మాత్రమే కావాలి అంటారా? ఇంతకు బాబు ఆలోచన ఏంటి? శ్రీ భరత్ కు పార్టీ పగ్గాలు అప్పగించడం పై బాబు ఎలాంటి సంకేతాలు ఇస్తారో చూడాలి మరి.

More News

ఆంధ్ర బ్యాంకును విలీనం చేయడం పై వైసీపీ నేతల ఆందోళన

ఆర్థిక మాంద్యం అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన నిర్ణయం తప్పు పడుతున్నారు నేతలు.

'ఎవ‌రు' చిత్రాన్ని నా కెరీర్ హ‌య్య‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చేసిన అంద‌రికీ థ్యాంక్స్ - అడివి శేష్‌

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందిన థ్రిల్లర్ `ఎవరు`.

అసదుద్దీన్ పై రాజా సింగ్ సంచలన ఆరోపణలు

గోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ ఆసక్తిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

ఈటెల నివాసానికి అభిమానుల తాకిడి

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నివాసం కిటకిటలాడింది. మేం గులాబీ జెండాకు ఓనర్లం అంటూ వ్యాఖ్యలు చేసిన ఈటెల ను కలిసేందుకు టీఆర్ఎస్ నాయకులు,

జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !

జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'వీడే సరైనోడు' పేరుతో అనువదిస్తున్నారు.