ఆమెకి చైతు అయినా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
80వ దశకం చివరిలోనూ, 90వ దశకం ఆరంభంలోనూ బలమైన కథానాయిక పాత్ర ఏదైనా ఉందంటే.. దర్శకులు ఆశ్రయించే హీరోయిన్స్‌లో రేవతి ఒకరు. తన అద్భుత నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు రేవతి. తమిళంతో పాటు తెలుగులో తనదైన ముద్ర వేసిన రేవతి.. ఓ విషయంలో చేదు అనుభవాన్నే చవిచూస్తున్నారు. అదేమిటంటే..తెలుగులో అమ్మపాత్రల్లో కనిపించిన ప్రతిసారీ ఫలితం పరంగా నిరాశే ఎదురవుతోంది ఆమెకి.
ఈశ్వర్లో ప్రభాస్‌కి సవతి తల్లిగా, లోఫర్లో వరుణ్‌తేజ్‌కి అమ్మగా, బ్రహ్మోత్సవంలో మహేష్‌బాబుకి తల్లిగా సందడి చేసిన రేవతికి ఆయా చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య కొత్త చిత్రం యుద్ధం శరణంలో తల్లి పాత్రలో మరోసారి కనిపించనున్న రేవతికి ఈ సారైనా పాజిటివ్ రిజల్ట్ దక్కుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com