Anasuya:జనసేన తరపున ప్రచారం చేస్తా.. అనసూయ కీలక వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేతల ప్రచారాలు, విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఏపీలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ నటి అనసూయ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయకు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేన తరపు ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
"ఇది వివాదం అవ్వొచ్చు కానీ.. అడిగారు కాబట్టి చెప్తున్నా. నేను తప్పై ఉండొచ్చు. నాకు లీడర్స్‌తోనే పని. పొలిటికల్ పార్టీలతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తాను. జబర్దస్త్‌లో రోజా, నాగబాబు ఇద్దరితో కలిసి పనిచేశాను. నాకు నాగబాబు గారు బాగా క్లోజ్. ఒకవేళ అటు నుంచి రోజా గారూ.. ఇటు నుంచి నాగబాబు గారూ పార్టీలోకి పిలిస్తే.. వెళ్తాను.. ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తాను. నాకు నాయకులతోనే పని. పార్టీలతో పని కాదు. నాకు చాలా పార్టీల నుంచి అనేక మంది లీడర్లు తెలుసు. వాళ్లని అభిమానిస్తాను.
"వాస్తవంగా నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. మా నాన్న గారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన పాలిటిక్స్ మానేయడానికి కారణం నేనే. కానీ నేను ఈ సొసైటీలో ఉంటున్నాను కాబట్టి.. మంచి లీడర్‌ని ఎన్నుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. మంచి లీడర్‌ని ఎన్నుకోమని నేనే వేరే వాళ్లకి చెప్పడం.. వాళ్లు నా వినడం అది నా అదృష్టం. నేను చెప్తే వింటారు కాబట్టి.. కరెక్ట్‌గా చెప్పాలి. నేను చెప్తే వింటారని ఏది పడితే అది చెప్పడం తప్పు. సినిమా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఒకవేళ జనసేన నుంచి ప్రచారం చేయమని అడిగితే తప్పకుండా వెళ్తాను. పవన్ కళ్యాణ్ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను వెళ్తాను. నేను వెళ్తే మాత్రం అభ్యర్థి గురించి పూర్తిగా తెలుసుకునే వెళ్తాను’ అంటూ వెల్లడించారు. దీంతో అనసూయ వ్యాఖ్యలను జనసైనికులు తెగ వైరల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఓ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ.. తర్వాత జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్ అయ్యారు. అనంతరం సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో వరుస అవకాశాలు రావడంతో జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఆమె నటించిన రంగస్థలం, పుష్ప, యాత్ర, రంగమార్తాండ, రజాకార్, క్షణం చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం పుష్ప2, ఆరి చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments