బ‌న్నీ.. మ‌హేష్‌.. వెన‌క్కి త‌గ్గేదెవ‌రు?

  • IndiaGlitz, [Wednesday,July 10 2019]

పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌వుతున్నాయంటే అభిమానుల్లోనే కాదు, సినిమా ఇండ‌స్ట్రీలోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌ల‌వుతుంది. ఈ చ‌ర్చ ముందుగా థియేట‌ర్ల విష‌యంలో మొద‌ల‌వుతుంది. తాజాగా మ‌ళ్లీ ఇలాంటి చ‌ర్చ మొద‌లైంది. ఈ సారి ఈ డిస్క‌ష‌న్ బ‌న్నీ, మ‌హేష్ ఇద్ద‌రూ క‌లిసి రానున్న 2020 సంక్రాంతి గురించి. నిజానికి వీరిద్ద‌రు గ‌తేడాది వేస‌వికి పోటీప‌డ్డారు. కానీ ఇండ‌స్ట్రీ శ్రేయ‌స్సు దృష్ట్యా ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. మ‌హేష్ కాస్త ముందుకు జ‌రిగాడు. బ‌న్ని కాస్త వెన‌క్కి జ‌రిగాడు. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించారు.

మే 4న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుద‌లైంది. భ‌ర‌త్ అనే నేను ఏప్రిల్ 20 విడుద‌లైంది.2020లోనూ మ‌ళ్లీ వీళ్లిద్ద‌రికీ పోటీ ప‌డ‌నుంది. అయితే ఈ సారి పోటీ వేస‌వికి కాదు. సంక్రాంతికి. మ‌హేష్ న‌టిస్తున్న 'స‌రిలేరు నీకెవ్వ‌రూ' అప్పుడే విడుద‌ల కానుంది. అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమా కూడా అప్పుడే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయినా సంక్రాంతి అన‌గానే ఎవ‌రూ మూడు రోజుల సెల‌వుల‌ను వ‌దులుకోవ‌డానికి ఒప్పుకోరు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఈ సారి వీరిద్ద‌రిలో ఎవ‌రు ముందు మిగులుతారు? ఎవ‌రు వెన‌క్కి త‌గ్గుతారు? ఇప్ప‌టికే రేస్‌లొ ఉండ‌టానికి స‌ర్వం సిద్ధం చేసుకుంటున్న మిగిలిన హీరోల ప‌రిస్థితి ఏంటి? ఏది ఏమైనా ఈ సంక్రాంతి మాత్రం రంజుగా ఉంటుంద‌న్న‌ది గ్యారంటీ.

More News

రామ్ స‌ర‌స‌న నివేతా పేతురాజ్‌

మెంట‌ల్ మ‌దిలో  చిత్రంతో తెలుగులో మెల్లిగా ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన దుబాయ్ భామ నివేతా పేతురాజ్ మెల్లిమెల్లిగా తెలుగులో సినిమాలు చేస్తోంది.

జగన్ సారూ.. అర్జెంట్‌గా వీటి సంగతేంటో తేల్చండి!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారో..?

సినిమాలకు మెగా హీరోయిన్ గుడ్ బై!!

మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

నవ్యాంధ్ర రాజధానిని వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..? సీఎం కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇప్పటి వరకూ అందుకే రాజధాని గురించి ఇంత వరకూ మాట్లాడలేదా..?

చంద్రబాబుకు మరో షాక్.. కీలకనేత రాజీనామా!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గడ్డుకాలం వచ్చి పడింది. పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..?