'బ్రహ్మోత్సవం' మరో 'మురారి' కానుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు కెరీర్‌లో మరపురాని చిత్రాలలో 'మురారి' ఒకటి. ఆ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ టీవీలో ఎప్పుడూ వచ్చినా ఆదరణకు తక్కువేమీ కాదు. ఆ సినిమా తరహాలో మళ్లీ మహేష్ నుంచి పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం రాలేదు. మధ్యలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వచ్చినా ఆ చిత్రం శైలి వేరు. మల్టీస్టారర్ సినిమా కావడం అనేది కూడా మరో కారణం.
అయితే మహేష్ కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం' ట్రైలర్స్, పోస్టర్లు చూస్తుంటే మళ్లీ 'మురారి' వాతావరణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసందడి దండిగా, పండగ వాతావరణంతో ఉన్న 'బ్రహ్మోత్సవం' మరో 'మురారి' అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments