Telangana Hung:తెలంగాణలో హంగ్ వస్తే పరిస్థితేంటి.. ఎవరు ఏ పార్టీతో కలుస్తారు..?
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు రెండు నెలలుగా జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రక్రియ గురువారంతో ముగిసింది. అయితే ఈసారి రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ ముగిసన వెంటనే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందని తెలిపాయి. కొన్ని సంస్థలు హంగ్ వస్తాయని వెల్లడించాయి. దీంతో అన్ని పార్టీలు ప్లాన్ బీ రెడీ చేసుకుంటున్నాయి. కౌంటింగ్ రోజు ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటన్నది కీలకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఇందులో కాస్త అడ్వాంటేజ్ కనపడుతుంది. ఎందుకుంటే ఆ పార్టీకి ఎంఐఎం, బీజేపీ రూపంలో మైత్రి ఎదురుచూస్తుంది.
119 అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో అధికారం రావాలంటే 60 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. అందుచేత గులాబీ పార్టీకి 53 సీట్లు వస్తే చాలు.. ఎంఐఎం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎలాగంటే ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 సీట్లు రావడం పక్కా. అప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి అధికారెం చేపడతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ 53 సీట్లు కన్నా తక్కువ వస్తే మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కష్టమవుతుంది. ఒకవేళ ఎంఐఎం అవసరం లేకుండా బీజేపీతో కలవాలంటే కమలం పార్టీకి కనీసం 10 సీట్లు అయినా రావాలి. అప్పుడు బీఆర్ఎస్‌కు 50 సీట్లు వచ్చినా సరిపోతుంది. దీని ప్రకారం హంగ్ వస్తే బీఆర్ఎస్ - మజ్లిస్ కలిసేందుకు మొదటి ఛాయిస్.. తర్వాత గులాబీ-కమలం రెండో ఛాయిస్‌గా ఉంది. ఈ రెండు జరగాలంటే కేసీఆర్ పార్టీకి కచ్చితంగా 50కు పైగా సీట్లు రావాలి.
పైన పేర్కొన్నట్లు జరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 60కి పైగా సీట్లు గెలవాల్సిందే. ఈ ఎన్నికలు ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటివి. అందుకు తగ్గట్లే ఆ పార్టీ నాయకులు కూడా ఎన్నికల్లో గట్టిగా కొట్లాడారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని మెజార్టీ సంస్థల సర్వేల్లో తేలింది. ఒకవేళ మేజిక్ ఫిగర్ రాకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌తో కలవాలి. కానీ అది జరిగే అంశం కాదు. ఒకవేళ బీఆర్ఎస్-కాంగ్రెస్ అధికారంలో భాగం అయితే ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డి వంటి నేతలు బీఆర్ఎస్ పార్టీతో కలిసి అధికారం పంచుకోవడాన్ని అసలు అంగీకరించకపోవచ్చు. ఈ అంశాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో 60 సీట్లు రావాల్సి ఉంటుంది. లేదంటే ఆ పార్టీ మరోసారి అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout