బాలయ్యతో ఎన్టీఆర్ గొడవ సమసిపోనుందా...
- IndiaGlitz, [Saturday,December 19 2015]
గత కొన్ని బాబాయ్ బాలయ్య, అబ్బాయి ఎన్టీఆర్‌ల మధ్య సైలెంట్ వార్ నడుస్తుంది. ఇది కాదనలేని విషయం. అయితే ఈ అంతరుద్యం వల్ల యంగ్ టైగర్ కెరీర్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ గొడవ విషయంలో ఇలాగే ఉండిపోతే గ్యాప్ మరింత పెరిగిపోతుందని అంటున్నారు. ఈ గ్యాప్ తగ్గించుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.
అందులో భాగంగా మూడు రోజుల క్రితం బాబాయ్ బాలయ్యతో ఫోన్ మాట్లాడాడట. ప్రస్తుతం స్పెయిన్‌లో నాన్నకు ప్రేమతో' ఎన్టీఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. స్పెయిన్ నుండి రాగానే బాబాయ్‌ను కలిసి క్షమాపణలు అడగటానికి ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడట. ఏదైతేనేం బాబాయ్, అబ్బాయ్‌ల మధ్య గొడవలు సమసిపోతే అభిమానులకు పండుగేనని చెప్పుకోవచ్చు.