బాలయ్య మాట నిలబెట్టుకుంటాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం `రూలర్`. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలవుతుంది. పక్కా బాలయ్య స్టైల్ ఆఫ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఉత్తరప్రదేశ్ స్థిరపడ్డ 2 వేల తెలుగు కుటుంబాలకు సంబంధించిన కథతో తెరకెక్కింది. అలాగే రైతు సమస్యలను కూడా ఇందులో చూపెడుతున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథను పరుచూరి మురళి అందించాడు. సి.కల్యాణ్ ఈ కథ కోసం బాలకృష్ణ ద్వారా పరుచూరి మురళికి ఫోన్ చేయించారు. ఆ సమయంలో తనతో ఓ సినిమా చేస్తానని కూడా బాలకృష్ణ అన్నాడట. ఈ విషయాన్ని రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సి.కల్యాణ్ సభా వేదికపైనే చెప్పుకొచ్చాడు.
గతంలో బాలకృష్ణతో పరుచూరి మురళి అధినాయకుడు అనే ప్లాప్ మూవీని తీశాడు. అయినా కూడా ఈ ప్లాప్ దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తానని చెప్పడం గొప్ప విషయం. మరి బాలకృష్ణ, పరుచూరి మురళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాను కూడా సి.కల్యాణ్‌నే నిర్మించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. పెదబాబు, ఆంధ్రుడు వంటి సినిమాలను తీసిన పరుచూరి మురళికి తర్వాత సక్సెస్‌లు లేవు. అయినా కూడా ఆయన్ని నమ్మి సినిమా చేస్తాననడం గొప్ప విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com