బాలయ్య హీరోయిన్ కొనసాగుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ కొత్త చిత్రం పైసా వసూల్‌లో ముగ్గురు హీరోయిన్స్ నటించారు. వారిలో సీనియర్ హీరోయిన్ శ్రియ ఒకరు. ఆ మధ్య రేసు గుర్రంలో ఓ పాట కోసం ఆడిపాడిన కైరా దత్ మరొకరు. ఇక మూడో హీరోయిన్ ముస్కాన్ కి మాత్రం ఇదే తొలి తెలుగు సినిమా. విషయమేమిటంటే.. ఇటీవల కాలంలో బాలకృష్ణ ఓ కొత్త హీరోయిన్‌తో కలిసి నటించడం అనేది అరుదనే చెప్పాలి.
పదకొండేళ్ల క్రితం వచ్చిన వీరభద్ర సినిమాలో బాలయ్యకి జోడీగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది తనుశ్రీ దత్తా. ఆ సినిమా తరువాత తనుశ్రీ మళ్లీ తెలుగులో కనిపించనేలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత బాలయ్య చిత్రంతో మరో కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. తనుశ్రీ బాటలోనే ముస్కాన్ కూడా వెళుతుందా? లేదంటే.. ఈ ఒక్క చిత్రానికే పరిమితమవకుండా కంటిన్యూగా సినిమాలు చేస్తుందా? అనేది ఆసక్తికరమైన అంశం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments