ఎమోషనల్ ఎంటర్టైనర్కు బాలయ్య ఓకే చెప్పారా?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 107వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో పూర్తి చేయడానికి తలమునకలై ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోయే సినిమా ఏది..! అనే దానిపై ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. అయితే బాలకృష్ణ చేయబోతున్నాడంటూ చాలా సినిమాలే లైన్లో ఉన్నాయి. క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో పాటు డైరెక్టర్ శ్రీవాస్, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ కూడా బాలకృష్ణ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. అయితే రీసెంట్గా శ్రీవాస్‌కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. బోయపాటి శ్రీను సహా చాలా మంది దర్శకులకు కథలు అందించిన రైటర్ ఎం.రత్నం ఓ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ కథను సిద్ధం చేశాడట. ఈ కథను రీసెంట్గా బాలకృష్ణకు వినిపిస్తే, నచ్చిందట. ఆయన సినిమా చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా కూడా ట్రాక్ ఎక్కుతుందని అంటున్నారు. ముందుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని, బాలయ్య చకచకా పూర్తి చేసి శ్రీవాస్ సినిమాను స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments