బాలయ్యతోనైనా ట్రాక్ మారుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకులలో కె.ఎస్.రవికుమార్ ఒకరు. ఇటీవల కాలంలో ఆశించిన విజయాలు లేకపోయినప్పటికీ.. గతంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఘనత ఆయనకుంది.'ముత్తు, భామనే సత్యభామనే, నరసింహా, దశావతారం' వంటి విజయవంతమైన అనువాద చిత్రాలతో తెలుగువారికీ ఈ దర్శకుడు సుపరిచితుడే.
అయితే ఎటొచ్చి.. తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రాలే ఈ డైరెక్టర్‌కి అంతగా కిక్ ఇవ్వలేదు. చిరంజీవితో రూపొందించిన 'స్నేహం కోసం' ఫరవాలేదనిపిస్తే.. నాగార్జునతో తెరకెక్కించిన 'బావనచ్చాడు' డిజాస్టర్ అయింది. ఇక రాజశేఖర్ కాంబినేషన్లో తీసిన 'విలన్' గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇవాళే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఆ చిత్రమైనా.. సదరు దర్శకుడికి తెలుగులో సాలిడ్ హిట్‌ని అందిస్తుందో లేదో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments