ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రివెంజ్ ఉంటుందా!?

  • IndiaGlitz, [Tuesday,June 11 2019]

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపట్నుంచి అనగా జూన్-12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులపాటు జరగనున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11:05 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఎమ్యెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఎల్లుండి స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసన సభ అధికారికంగా ఎన్నుకొనున్నారు. కాగా.. ఈ నెల 14న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నతెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసి గవర్నర్...ఈ నెల 15,16 తేదీల్లో శాసన సభకు సెలవు. ఈ నెల 17,18న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ నెల 18తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

జగన్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు!

కాగా.. అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. జగన్ నిర్ణయాలపై ప్రజలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కేబినేట్ నిర్ణయాలతో సీఎం జగన్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్దతిలో సమావేశాలు జరుగుతాయి. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వల్లే ప్రజలు బాగా గుణపాఠం చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం మీద ఎక్కువగా దృష్టి పెడతాం. రేపు సీఎం చంద్రబాబు మొదటిరోజు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఎల్లుండి స్పీకర్ ఎంపిక, 14న గవర్నర్ ప్రసంగం ఉంటుంది అని శ్రీకాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

రివెంజ్ ఉంటుందా!

కాగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న సమావేశాలు కావడంతో హాట్ హాట్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కూడా మైక్ ఇవ్వకుండా స్పీకర్ ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది గనుక రివెంజ్ తీర్చుకుంటుందా..? లేదా సభ సజావుగా జరిపి అందరికీ సమన్యాయం అన్నట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను స్పీకర్ సమంగా చూస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.

More News

ఏపీ సెక్రటేరియట్‌‌కు కత్తి మహేశ్ ఎందుకెళ్లినట్లు!?

టాలీవుడ్‌లో వివాదాలకు మారుపేరుగా ఉన్న సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ఉన్నట్టుండి ఏపీ సెక్రటేరియట్‌లో ప్రత్యక్షమయ్యాడు.

రోజా, అంబటి, ఆళ్లకు త్వరలో కీలక బాధ్యతలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు ఆశించి.. చివరి నిమిషం వరకు పక్కా అనుకుని దక్కించుకోలేకపోయిన వారిలో రోజా, అంబటి రాంబాబు

జూన్ 28న విడుద‌ల‌వుతున్న‌ శ్రీవిష్ణు, నివేథా థామ‌స్ 'బ్రోచేవారెవ‌రురా'

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది.

అయ్యో.. రోజా కంటే ముందే ‘ఆమె’కు కీలక పదవి!?

అవును.. మీరు వింటున్నది నిజమే ‘ఆమె’కు కీలక పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి జగన్ ఫిక్స్ అయ్యారట.

ర‌జ‌నీ, క‌మ‌ల్‌పై స‌త్య‌రాజ్ ఫైర్‌

స‌త్య‌రాజ్‌.. ఒక‌ప్పుడు ఈ న‌టుడి గురించి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, బాహుబ‌లి, మిర్చి స‌హా ప‌లు తెలుగు చిత్రాల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుకు సుప‌రిచితుడిగా మారారు.