బన్ని బ్రదర్ సినిమా..సెంటిమెంట్ అధిగమిస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా సినిమాకి తన రేంజ్‌ని పెంచుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్. 'సరైనోడు' తో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్న బన్ని.. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నాడు. ఎటొచ్చి అతని సోదరుడు అల్లు శిరీష్ నే కొత్త సినిమా విషయంలో కొంచెం టెన్షన్ గా ఫీలవుతున్నాడని వినిపిస్తోంది. ప్రస్తుతం శిరీష్.. పరుశురామ్ దర్శకత్వంలో 'శ్రీరస్తు శుభమస్తు' అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అసలు విషయానికి వస్తే.. పరుశురామ్ ఇప్పటివరకు నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు. వాటిలో 'యువత', 'సోలో' చిత్రాలు హిట్ లిస్ట్‌లో చేరగా, 'ఆంజనేయులు', 'సారొచ్చారు' ఆశించిన విజయం సాధించలేదు.
హిట్ లిస్ట్ లో చేరిన రెండు చిత్రాలు అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోలవి కావడం అనేది శిరీష్ సినిమాకు కలిసొచ్చే అంశం. అయితే కలిసిరాని అంశం ఏమిటంటే.. హిట్ అయిన రెండు సినిమాలు నవంబర్లోనే విడుదలయ్యాయి. అంతగా కలిసిరాని చిత్రాలేమో వేరే నెలలలో విడుదలయ్యాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం ఒకట్రెండు నెలల్లో రానున్న 'శ్రీరస్తు శుభమస్తు', పరుశురామ్ నెగెటివ్ సెంటిమెంట్‌ని అధిగమిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com