బన్నికున్న ట్రాక్ రికార్డ్ మారుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
'రుద్రమదేవి'.. ప్రస్తుతం టాలీవుడ్ ఫోకస్ అంతా ఈ సినిమాపైనే. రేపు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ అన్ని విధాలా సిద్ధమైంది. అలాగే ఎన్నో సెంటిమెంట్‌లకు ఈ సినిమా విజయంతో బ్రేక్ పడాల్సి ఉంది. అలాంటి సెంటిమెంట్‌లో ఒకటి ఈ చిత్రంలోని ముగ్గురు వ్యక్తులతో అల్లు అర్జున్‌కున్న నెగెటివ్ ట్రాక్ రికార్డ్.
అదేమిటంటే.. గుణశేఖర్‌తో బన్నితొలిసారి చేసిన 'వరుడు', అనుష్కతో తొలిసారి నటించిన 'వేదం', కేథరిన్‌తో ఇప్పటికే ఓ సారి నటించిన 'ఇద్దరమ్మాయిలతో'.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిని ఉండడం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురితో రెండోసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న బన్నికి ఆ ట్రాక్ రికార్డ్ మారి హిట్ దక్కుతుందేమో చూడాలి. 'రుద్రమదేవి'లో గోనగన్నా రెడ్డి అనే పవర్‌ఫుల్ రోల్‌లో బన్ని సందడి చేయనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments