దువ్వాడ రిలీజ్ డేట్ మారనుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం డిజె `దువ్వాడ జగన్నాథమ్`. హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై పదిమిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది.
ముందుగా సినిమాను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉండటం ఇత్యాది కారణాలతో సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందట. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం సినిమాను జూలై 7న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయట. ఎదో త్వరత్వరగా చుట్టేయాలని కాకుండా నింపాదిగా చేసి, కరెక్ట్ టైంలో రిలీజ్‌కు రావాలని నిర్మాతలు యోచిస్తున్నారేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments