బన్ని ఈ సారైనా కచ్చితంగా వస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడు పాత్రల్లో నటించిన రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో 50 కోట్ల క్లబ్‌లోకి చేరాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ కేటగిరిలో హ్యాట్రిక్ కొట్టడానికి సిన్సియర్‌గా ట్రై చేస్తున్నాడు బన్ని. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న సరైనోడు (పరిశీలనలో ఉన్న టైటిల్) కోసం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు సదరు మెగా వారి కథానాయకుడు. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత బోయపాటి శ్రీను నుంచి వస్తున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మెగా క్యాంప్‌లో బోయపాటి చేస్తున్న ఈ తొలి చిత్రం.. అతని గత చిత్రాల తరహాలోనే విజయబావుటా ఎగరవేయడం ఖాయంగా చిత్ర వర్గాలు సైతం ఇప్పట్నుంచే చెప్పుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తోందని సమాచారం. బన్ని గత చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిని కూడా ఫిబ్రవరిలోనే విడుదల చేయాలనుకుని.. కొన్ని కారణాల వల్ల ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో నయా చిత్రాన్నైనా సకాలంలో తీసుకువస్తారా లేదంటే.. రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో ఏప్రిల్‌లోనే విడుదల చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా. అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కీ రోల్ లో నటించిన రుద్రమదేవి ఈ నెల అక్టోబర్ 9న రిలీజ్‌కి రెడీ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com