అదితి ఆర్యకు ఈసారైనా కలిసొస్తుందా...

  • IndiaGlitz, [Sunday,July 09 2017]

2015లో మిస్‌ ఇండియాగా ఎన్నికైంది ఆదితి ఆర్య. ఢిల్లీకి చెందిన ఈ భామ మోడలింగ్‌లోనూ రాణించింది. మోడలింగ్‌ నుండి సినిమా రంగం వైపు దృష్టి సారించింది. పూరి జగన్నాథ్‌, కల్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌లో విడుదలైన 'ఇజమ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.
అయితే 'ఇజమ్‌' సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆదితి ఆర్యకు నిరాశ మిగిలింది. తెలుగు నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం హవీష్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించనుందట. సాయి అనే కొత్త దర్శకుడితో జవహర్‌బాబు, రమేష్‌ వర్మ నిర్మాతలుగా సినిమా రూపొందనుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమాతో అయినా అదితి ఆర్యకు అదృష్టం తలుపు తడుతుందేమో చూద్దాం.