విల‌న్ గా న‌టిస్తానంటున్న హీరో..

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

విల‌న్ గా న‌టిస్తానంటున్న హీరో ఎవ‌రో కాదు...శ్రీకాంత్. అవును..ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రీకాంతే మీడియాకు చెప్పారు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ పోలీస్ గా న‌టిస్తున్న చిత్రం మెంట‌ల్. ఈ చిత్రంలో శ్రీకాంత్ స‌ర‌స‌న అక్ష న‌టించింది. క‌ర‌ణం పి.బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో వీవీఎస్ఎన్వీ, ప్ర‌సాద్ దాస‌రి, వీవీ దుర్గాప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెంట‌ల్ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ...మొద‌ట ఈ చిత్రానికి మెంట‌ల్ పోలీస్ అనే టైటిల్ పెట్టాం. అయితే..టైటిల్ పై వివాదం కోర్టు వ‌ర‌కు వెళ్ల‌డంతో మెంట‌ల్ గా మార్చాం. రూల్స్ ని ఎవ‌రు అతిక్ర‌మించినా క్ష‌మించ‌ని సిన్సియ‌ర్ పోలీస్ గా న‌టించాను. పోలీసులు గ‌ర్వ‌ప‌డేలా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. విల‌న్ పాత్ర చేయ‌మ‌ని న‌న్ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు. భ‌విష్య‌త్ లో ఎవ‌రైనా విల‌న్ పాత్ర చేయ‌మ‌ని వ‌స్తే...ఆ పాత్ర నాకు న‌చ్చితే ఖ‌చ్చితంగా చేస్తాను అని చెప్పారు. సో...శ్రీకాంత్ భ‌విష్యత్ లో విల‌న్ గా న‌టించే అవ‌కాశం ఉంది. అయితే...ఎవ‌రి చిత్రంలో విల‌న్ గా న‌టిస్తాడో చూడాలి.

More News

ఆ విష‌యంలో..సుడిగాడు త‌ర్వాత సెల్ఫీరాజా - అల్ల‌రి న‌రేష్

అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి, కామ్నారనావత్ హీరో, హీరోయిన్లుగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సెల్ఫీరాజా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు.

హీరోగా రానా త‌మ్ముడు

మూవీ మొఘ‌ల్ రామానాయుడు ఇద్ద‌రు మ‌న‌వళ్ళ‌లో ఒక‌రైన ద‌గ్గుబాటి అభిరాం త్వ‌ర‌లోనే హీరోగా తెరంగేట్రం చేయ‌బోతున్నాడట‌. సీనియ‌ర్ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఫ్యాష‌న్ డిజైన‌ర్(ప‌రిశీల‌న‌లో ఉంది) చిత్రంలో హీరోగా క‌న‌ప‌డ‌నున్నాడు.

ర‌వితేజ కొత్త మూవీల‌ ప్లానింగ్‌

బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ మ‌హారాజా ఏ చిత్రంలో న‌టిస్తాడ‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. దిల్ రాజుతో, డి.వి.వి.దాన‌య్య‌తో ఇలా కొంత నిర్మాత‌లు కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు అనుకున్న‌ప్ప‌టికీ ఎవీ పట్టాలెక్క‌లేదు.

ఫ్రెంచ్‌లోకి 'ప్రేమ‌మ్‌'

అక్కినేని నాగచైతన్య హీరోగా . సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో మలయాళ చిత్రం `ప్రేమమ్` ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

శ్రీరస్తు - శుభమస్తు టైటిల్ సాంగ్ రిలీజ్..

అల్లు శిరీష్ -లావణ్య త్రిపాఠి జంట గా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు.