15 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయ్. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..? ఎవరు గోడ దూకుతారో..? తెలియని పరిస్థితి. మరీ ముఖ్యంగా వైసీపీ ఊహించని విధంగా 175 అసెంబ్లీ సీట్లలో 151 కైవసం చేసుకోవడం.. 25 పార్లమెంట్లో 22 దాకా గెలుచుకో.. టీడీపీ, జనసేన ఘోరాతి ఘోరంగా విఫలమయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాల్లో.. 03 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీకి భారీ షాక్ తగిలినట్లయ్యింది.
ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది..!
అయితే.. తాజాగా మరో 15 మంది ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్ అవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే వీరందరికీ ఓ కీలక నేత నేతృత్వం వహిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ కీలక నేతల ఇంతవరకూ ఓటమెరుగని నేతగా పేరుగాంచిన వ్యక్తి అని.. ఆయనతో సహా మరో 15 మంది ఎమ్మెల్యేలు జంప్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కీలక నేత విదేశీ పర్యటనలో బిజిబిజీగా ఉన్నారని ఆయన తిరిగి రాగానే బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో కాషాయ కండువాలు కప్పుకుంటారని సమాచారం. అంతేకాదు ఆ 15 మంది ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు.. ఈ ఎన్నికల్లో ఓడిన కీలక నేతలు సైతం బీజేపీలో చేరతారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరలోనే బీజేపీలోకి భారీగానే చేరికలు ఉంటాయని సమాచారం.
చంద్రబాబు ఏం చేయబోతున్నారు..!
కాగా.. ప్రస్తుతం ఈ వార్త టీడీపీని కలవరపెడుతోంది. ఇప్పటికే నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. మరోవైపు కాపు ఎమ్మెల్యేలు, మాజీలు రహస్యంగా సమావేశం కావడం.. తాజాగా 15మంది వీడుతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వార్తలు తెలుసుకుని షాకయ్యారట. వీలైనంత త్వరలోనే పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చి ఈ వ్యవహారంపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 15 మంది ఎమ్మెల్యేల జంపింగ్‌ల వ్యవహారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments