నేడు వికీపీడియా పుట్టినరోజు.. 20 ఏళ్లలో ఎన్నో మార్పులు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవరైనా ప్రముఖుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఏం చేస్తారు? ఆ ప్రముఖుడి పేరును గూగుల్లో టైప్ చేస్తారు. వెంటనే ఆ ప్రముఖుడికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాల నుంచి ఇటీవల వరకూ సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నంతా అందించేది వికీపీడియా. వికీపీడియా జన్మదినం నేడు. ఈ వికీపీడియాను జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్లు సంయుక్తంగా ఇదే రోజున 2001లో ప్రారంభించారు. అంటే వికీపీడియా పుట్టి నేటికి సరిగ్గా 20 ఏళ్లు.
ప్రస్తుతమున్న సాంకేతిక ప్రపంచంలో దేని గురించైనా తెలుసుకోవాలంటే అదంత అసాధ్యమేమీ కాదు. చాలా సులభంగా సమాచారమంతా తెలుసుకోవచ్చు. దీనిని సులభతరం చేసింది మాత్రం వికీపీడియానే అనడంలో సందేహం లేదు. ఇలా సమాచారాన్నంతటినీ క్రోడీకరించి ఏకీకృతం చేసే ఈ వేదికను క్రౌడ్ సోర్సింగ్ అంటారు. అయితే వికీపీడియా ఈ 20 ఏళ్లలో ఎన్నో మార్పులకు గురైంది. తొలుత వికీపీడియా సమాచారాన్ని ఎడిట్ చేయగలిగే సౌలభ్యం లేదు. కానీ ఇప్పుడు యూజర్లందరికీ ఎడిట్ చేసే అవకాశాన్ని కల్పించారు.
అలాగే మొదట్లో వికీపీడియాను ఇంగ్లీష్ భాషలో మాత్రమే ప్రారంభించారు. కానీ ఇప్పుడు 300 పైచిలుకు భాషల్లో మనకు అందుబాటులో ఉంది. 2003లో వీకీపీడియాను హిందీ బాషలో ఆవిష్కరించారు. ప్రస్తుతం వికీపీడియాలో 5.5 కోట్లకు పైగా ఆర్టికల్స్ నెటిజన్లకు అందుబాటులో ఉన్నాయి. వీకీపీడియాను ప్రారంభించేముందు జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ దీనికి న్యూపీడియా పేరుతో ఈ ఎన్సైక్లోపీడియాను ఆవిష్కరించారు. తరువాతి కాలంలో వికీపీడియాను ఆవిష్కరించారు. దీంతో దేనికి సంబంధించిన సమాచారమైనా ఇట్టే తెలుసుకునే అవకాశం కలిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com