19 ఏళ్ల జయం.. నితిన్ భార్య మెమొరబుల్ పోస్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ నితిన్ నేటితో 19 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా 19 ఏళ్ళక్రితం నితిన్ నటించిన జయం మూవీ 14 జూన్, 2003 లో విడుదలయింది. క్రేజీ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నితిన్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. స్నేహితుడితో బైక్ పై..
దాదాపు దశాబ్ద కాలం హిట్ లేకపోయినా నితిన్ వెనకడుగు వేయలేదు. ఇష్క్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తన కెరీర్ లో నితిన్.. రాజమౌళి, పూరి జగన్నాధ్, వినాయక్ లాంటి అగ్ర దర్శకులందరితో వర్క్ చేశాడు. జయం, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ.., భీష్మ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు నితిన్ కు దక్కాయి.
జయం విడుదలై 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నితిన్ స్పందించాడు. 'జయం 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ చిత్ర అనుభవాలు మరచిపోలేనివి. నన్ను ఇంతగా ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. దర్శకుడు తేజ సర్ కు ఎప్పటికి రుణపడి ఉంటాను' అని నితిన్ ట్వీట్ చేశాడు.
ఇక నితిన్ సతీమణి షాలిని కూడా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తన భర్త 19 ఏళ్ల కెరీర్ ని తెలియజేస్తూ ఈ పోస్ట్ పెట్టింది. 'హ్యాపీ 19 హస్బెండ్. ఇదే నీ లాస్ట్ టీన్ ఇయర్. అడల్ట్ హుడ్ కి స్వాగతం. నీవు చాలా మందికి ఆదర్శం. ఇక నుంచి రాబోవు సంవత్సరాలన్నీ నీ కెరీర్ లో బెస్ట్ గా ఉండాలి' అని షాలిని కామెంట్స్ చేసింది.
నితిన్ ప్రస్తుతం మాస్ట్రో చిత్రంలో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు . ఈ మూవీ తర్వాత నాపేరు సూర్య దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఈ ఏడాది నితిన్ నుంచి రంగ్ దే, చెక్ చిత్రాలు వచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments