ఈ నెల 20న 'వైఫ్ ఆఫ్ రామ్'

  • IndiaGlitz, [Friday,July 06 2018]

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’.విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

రీసెంట్ గా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ఎంట్రీ సాధించిందీ సినిమా. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ‘సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్’గా పేర్కొనడం విశేషం. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందంటున్నాడు దర్శకుడు విజయ్.

ఇక ట్రైలర్ తో విపరీతమైన అటెన్షన్ తెచ్చుకున్న వైఫ్ ఆఫ్ రామ్ సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీం ను ప్రశంసించారు. మంచు లక్ష్మి కెరీర్ లో ఇది ఓ మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఇప్పటికే సినిమా చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల 20న విడుదల కాబోతోంది ‘వైఫ్ ఆఫ్ రామ్’.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.

More News

'చి ల సౌ' సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సిరుని కార్పొరేషన్ అసోసియేట్!

సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

మనదేశం సందర్భం తో 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం

మహానీయుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ ఈరోజు ప్రారంభమైన సందర్భంగా ఈరోజును చారిత్రాత్మక రోజుగా పరిగనించవచ్చు.

నాగార్జున, నాని సినిమా టైటిల్ 'దేవదాస్'

నాగార్జున & నాని మల్టిస్టార్టర్ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు 'దేవదాస్' టైటిల్ ను ఖరారు చేసారు.

అరుణ్ ఆదిత్ హీరోగా 'జిగేల్' ప్రారంభం 

"కథ" చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన అరుణ్ ఆదిత్ ఇటీవల "పి.ఎస్.వి గరుడ వేగ"

'8కె' కెమెరాతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న‌ తొలి సినిమా 'యు'

కొవెర  హీరోగా త‌నికెళ్ల భ‌ర‌ణి, 'శుభ‌లేఖ‌' సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం 'యు'. దీనికి ఉప‌శీర్షిక 'క‌థే హీరో'.