జనసేన అంటే జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో!
Send us your feedback to audioarticles@vaarta.com
"కేసీఆర్ లాంటి వాళ్లు మన ఓటింగ్ ఒక శాతమే అంటున్నారు. ఒక్క శాతమే అయితే జనసేన అనగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం గాజువాకలో పవన్ మాట్లాడుతూ.. " 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చినప్పుడే నాకు తెలంగాణ వస్తుందన్న సంగతి అర్ధం అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు మారాలని కలలు కన్నా. ఒకరు ధైర్యంగా ముందడుగు వేస్తే అది వంద మందికి ధైర్యం అవుతుంది. ఆ అడుగు నేనే వేయాలని నిర్ణయించుకున్నా, నాడు నా ఒక్కడితో ప్రారంభం అయిన పయనం నేడు లక్షల మందిని ముందుకు వచ్చేలా చేసింది. 2019 ఎన్నికలు మార్పు తెచ్చే ఎన్నికలు. అలా అని అద్భుతాలు ఆశించడం లేదు. కేసీఆర్ లాంటి వాళ్లు మన ఓటింగ్ ఒక శాతమే అంటున్నారు. ఒక్క శాతమే అయితే జనసేన అనగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం ఎందుకు రానివ్వలేదు. అడ్డంకులు వస్తాయి. ప్రత్యర్ధులు మన అభివృద్ధిని మనకి తెలియకుండా జాగ్రత్త పడతారు. రాజకీయాల్లో ఉండాలంటే మొండితనం, ధైర్యం ఉండాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడను. పదేళ్లు సక్సెస్ లేకపోయినా ఏనాడు అధైర్యపడలేదు. నేను ఎంత ఒత్తిడిని అయినా తీసుకోగలను" అని పవన్ చెప్పుకొచ్చారు.
మార్పు కోసం..
"మార్పు కోసం మీ సహాయం అర్ధించడానికి వచ్చా. నేను యాక్టర్‌గా మాత్రమే మీకు తెలుసు. నాకు బలమమైన ఆలోచనా విధానం ఉంది. రాజకీయాల్లో ఒంటెద్దు పోకడలు పనిచేయవు. దేశభక్తి హిందువులకే పరిమితం లాంటి వాదనలు సరికాదు. ప్రతి మతంలో దేశభక్తి ఉంటుంది. దాన్ని ఎలా బయటికి తీయాలన్నదే ఇక్కడ కీలకం. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయాణం మార్పు కోసం చేస్తున్న ప్రయాణం.. మార్పు కోసం యుద్ధం చేస్తున్నాను. మీ బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న యుద్ధానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే, రెండు పార్టీలు కలసి ప్రజల్ని అడ్డంగా దోచుకునేవి. మూడో ప్రత్యామ్నాయం లేకపోతే న్యాయం జరగదు. రాయలసీమ మాదిరి అధికారంలో ఉన్న వారు 60 శాతం, ప్రతిపక్షంలో ఉన్న వారు 40 శాతం అంటూ వాటాలు వేసుకుంటారు. గ్రామస్థాయిలో సైతం ఇదే పరిస్థితి ఉంటుంది. మూడో ప్రత్యామ్నాయంతోనే ఆ దోపిడిని ఆపగలం. ప్రజలకి న్యాయం చేయగలం" అని పవన్ కల్యాణ్ సభా వేదికగా తెలిపారు.
ఇదేం లెక్క పవన్..!?
కాగా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యేదే కాదని ఏ తెలుగు వాడిని అడిగినా చెబుతారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ వస్తుందని తనకు అర్థమైపోయిందని చెబుతుండటం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, పలువురు వైఎస్సార్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు దేశాన్ని ఏలిన ఒకప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మను సైతం ఢీ కొని.. తనపై ఎన్నికుట్రలు పన్నినా ఆఖరికి జైలుకు పంపినా మనో ధైర్యంతో ఎదుర్కొని.. ఎంత మంది, ఎన్ని పార్టీలు కలిసొచ్చినా ‘నేనొక్కడినే’ అంటూ బరిలోకి దిగిన ఒకే ఒక్క వ్యక్తి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అలాంటిది మీకు ఆయన భయపడటమా..? అంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments