Congress:ఎందుకేయాలి మీకు ఓటు.. కేసీఆర్ పాత్రధారితో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల్లో ప్రచారం చాలా కీలకమైంది. ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రచారాలు చేస్తాయి పార్టీలు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచారం చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ 'మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు, వాటి వైఫల్యాలను విమర్శిస్తూ వీడియోలను రూపొందించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కేసీఆర్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి తాము అధికారంలోకి వస్తే హామీలు నెరవేరుస్తామని చెప్పగా.. ప్రజల నుంచి హామీలపై ప్రశ్నిస్తున్నట్లు చూపించారు.
ఒక్క వీడియోలో.. ప్రజలారా నమస్తే బీఆర్ఎస్‌కు ఓటేస్తే హామీలు పక్కా అంటూ కేసీఆర్ పాత్రధారి చెప్పగా "పేపర్లు లీక్ చేశారని, నిరుద్యోగ భృతి అని నిండా ముంచారని, ధరణీ పేరుతో భూములు లాక్కున్నారని, రుణమాఫీ, ఉచిత ఎరువులు అని రైతుల నోట్లో మన్ను కొట్టారని, డబుల్ బెడ్ రూంలు కట్టేయలేదని, కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారని ఎందుకేయాలి మీకు ఓటు చల్ నడవండి.." అంటూ చూపించారు.
మరో వీడియోలో.. ప్రజా ఆశీర్వాద సభలో కాళేశ్వరం, ధరణి పోర్టల్, ఇంటింటికీ నల్లా, ఉద్యోగాలు వంటి అంశాలను కేసీఆర్ పాత్రదారి ప్రస్తావించగా.. మైక్‌లో కౌంటర్లు వస్తూ ఉన్నాయి. ఈ రెండు వీడియోల చివరలో ప్రజలు తరమేస్తున్నట్లుగా, కారు పంఛర్ అయినట్లుగా.. పదేండ్ల అహంకారం పోవాలంటే, పదేండ్ల అవినీతిని తరమాలంటే 'మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి' అనే నినాదం ఇచ్చారు.
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. అక్కడ ఇలాంటి ప్రచారాలు సక్సెస్ అయి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను అమలుచేస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు ఫలిస్తాయో తెలియాలంటే డిసెంబర్ 3వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments