జనసేన గురించి రాములమ్మ ఎందుకిలా అన్నారో..!

  • IndiaGlitz, [Friday,April 05 2019]

మెగా ఫ్యామిలీ అంటే సీనియర్ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మకు ఎనలేని గౌరవం, ఇష్టం. అది సినిమా పరంగాను.. పొలిటికల్ పరంగాను రెండు విధాలా వచ్చిన గౌరవమే. తెలంగాణలో ఎన్నికలు మొదలైనప్పట్నుంచి సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న రాములమ్మ అధికార పార్టీని, కాంగ్రెస్ నేతలను విమర్శించిన వారిని తిట్టిపోస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తనదైన శైలిలో సలహాలు సైతం ఇస్తున్నారు విజయశాంతి. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌కు పలుమార్లు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు.. ఆయన వ్యాఖ్యలను సమర్థించారు కూడా. అయితే ఏం జరిగిందో ఏమోగానీ సడన్‌ ఆమె యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణలో జనసేన అక్కర్లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈమె అన్న వ్యాఖ్యలు వెనుక అర్థం, పరమార్థం వేరే ఉంది. 

ఇదీ అసలు కథ...

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు వేలు పెట్టారని అందుకే తాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పిన విషయం విదితమే. అయితే కేసీఆర్ ఏపీలో వేలు పెట్టొద్దు అంటూ అటు చంద్రబాబు అండ్ కో.. ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగ సభలు పెడితే చాలు పవన్ అండ్ చంద్రబాబు ఇద్దరూ కేసీఆర్ పేరు పదే పదే ఎత్తడం.. తీవ్ర స్థాయిలో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం గానీ కనీసం గులాబీ పార్టీకి చెందిన నేతలు మొదలుకుని గులాబీ బాస్ వరకు ఎవరూ స్పందించనేలేదు. దీంతో మరింత జోరు పెంచి మరీ కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. 

రాములమ్మ రియాక్షన్...

తాజాగా.. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రమేయం వద్దని పవన్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాములమ్మ రియాక్ట్ అయ్యారు. అవును పవన్ అలా మాట్లాడటం సమంజసమే అని ఆమె సమర్థించారు. అయితే తెలంగాణలో కూడా జనసేన అవసరం లేదని ఆ పార్టీ గుర్తించాలని పవన్‌కు సూచించారు. కారుకు (టీఆర్ఎస్ గుర్తు) ఫ్యాన్(వైసీపీ గుర్తు) కడితే హెలికాప్టర్‌లా ఎగరొచ్చని కేసీఆర్‌ భ్రమపడుతున్నారని.. గులాబీ బాస్ భ్రమలను మార్చలేమని విజయశాంతి చెప్పుకొచ్చారు.  క్రాష్‌ ల్యాండింగ్‌ మాత్రమే ఆయనకు అవగాహన కల్పిస్తుందని రాములమ్మ తేల్చిచెప్పారు. అయితే తెలంగాణలో జనసేన అక్కర్లేదని చెప్పడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రాములమ్మపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై పవన్, జనసేన నేతలు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

జనసేనకు ప్రచారం చేయనున్న ఇద్దరు మెగా హీరోలు!

ఏపీలో ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండటంతో అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

జనసేన మేనిఫెస్టోపై చెర్రీ ఆసక్తికర ట్వీట్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల కంటే ముందుగా జనసేన మేనిఫెస్టో ప్రకటించిన విషయం విదితమే.

వైఎస్ జగన్ స్థానంలో నేనుంటే.. పవన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

జనసేనకు జనం బ్రహ్మరథం.. గంటా 'గంట' అంతే!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాద‌ర‌ణ ఉన్న నాయ‌కుడు కాదు.. ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి డ‌బ్బుతో ప్రజాద‌ర‌ణను కొనుక్కోవాలనుకొంటున్నారు

మీ ఇంట్లో మనిషిగా గుర్తించండి.. ఒక్క ఫోన్ కాల్‌తో..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌స్తే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు అన్నీ తీసేస్తాడంటూ టీడీపీ నాయ‌కులు దుష్ప్రచారం చేస్తున్నారు...