హిందీలో టైటిల్ మారింది ఎందుకో...?
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా సినిమాలకు టైటిల్స్ విషయంలో ఏదైనా పేచీ ఉంటే మార్పు ఉండటం కామన్‌గా జరుగుతుంటుంది. కానీ బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న తెలుగు సినిమా అర్జున్ రెడ్డి సినిమా టైటిల్ మారిపోయింది.
విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్లో షాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ముందుగా అర్జున్ రెడ్డి అనే టైటిల్‌ను అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు.
అయితే సినిమా స్టార్ట్ కావడానికి ముందే టైటిల్ విషయంలో ఏమనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు దాన్ని కబీర్ సింగ్ అని మార్చేశారు. తెలుగు అర్జున్ రెడ్డిని డైరెక్టర్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, కిషన్ కుమార్, అశ్విన్ వర్దే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 21న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com