అఖిల ప్రియను ఒంటరిని చేసిన టీడీపీ.. అసలు పట్టించుకోరేం..

  • IndiaGlitz, [Friday,January 22 2021]

హైదరాబాద్‌లో ప్రవీణ్ రావు అన్నదమ్ముల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె భర్త, ఆయన కుటుంబం అడ్డంగా ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అఖిల ప్రియ అరెస్టై జైల్లో ఉన్నారు. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు పెను సంచలనానికి దారి తీసింది. కిడ్నాప్ వ్యవహారమంతా సినిమాటిక్ స్టైల్లో జరగడం.. కిడ్నాప్ చేసిన నిందితులెవరో పోలీసులు 24 గంటల్లోపే గుర్తించడం.. ప్రధాన నిందితురాలు అఖిల ప్రియ అరెస్ట్ అవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.

అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా.. తమ పార్టీకి చెందిన కీలక నేత అరెస్ట్ అయినా టీడీపీ మాత్రం ఈ వ్యవహారంలో మిన్నకుండిపోయింది. కనీసం ఖండించనూ లేదు.. లేదంటే అఖిలప్రియకు మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయనూ లేదు. ఏపీలో ఏం జరిగినా.. తమ పార్టీ నేతల విషయంలో గవర్నమెంట్ ఏ చిన్న వ్యాఖ్య చేసినా మూకుమ్మడిగా ఖండించే టీడీపీ నేతలు.. మరి అఖిల ప్రియ విషయంలో మాత్రం ఎందుకు మిన్నకుండిపోయారనేది అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం అఖిల ప్రియ జైలులో ఉంటే ఆమె సోదరి భూమా మౌనిక మాత్రం ఒంటరి పోరుకు దిగింది.

తమ సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డలో పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, తమ అనుచరులకు భరోసా ఇస్తున్నారు. కనీసం మౌనికకు కూడా తోడుగా ఉండేందుకు ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఆసక్తి చూపడం లేదు. అసలు వీరి విషయాన్ని ప్రస్తావించడానికే టీడీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి.. చింతమనేని ప్రభాకర్‌కి అండగా నిలిచిన పార్టీ.. అఖిలప్రియ ఫ్యామిలీని మాత్రం ఒంటరిగా వదిలేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

More News

ఆందోళనకరంగా శశికళ ఆరోగ్యం.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్

ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని....

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన నూతన ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'

అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం