తమన్నా స్పెషల్ సాంగ్ చేయలేదెందుకు?
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీబ్యూటీ తమన్నా తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మి', 'ఎఫ్2' సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలే కాకుండా నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'సవ్యసాచి' చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తానని అంగీకరించింది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తమన్నా ఆ సాంగ్‌లో చేయడం లేదు. అందుకు కారణం ఏ ఒక్కరూ కారు.. పరిస్థితులే అంటున్నారు. నాగార్జున నటించిన చిత్రం అల్లరి అల్లుడు ఇందులో కాలేజ్ నేపథ్యంలో వచ్చే సాంగ్ 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగయిత్తు.. ' ఈ సాంగ్‌ను సవ్యసాచిలో రీమేక్ చేయాలనుకున్నారు.
తమన్నా కూడా నటిస్తానని చెప్పింది. అయితే ప్రస్తుతం కథ దృష్ట్యా స్పెషల్ సాంగ్ ప్లేస్ మెంట్ ఇబ్బందిగా మారింది. దీంతో యూనిట్ ఈ సాంగ్‌ను తమన్నాతో చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments