అభిమానులు అంటే అంత చిన్నచూపా..?
- IndiaGlitz, [Tuesday,August 23 2016]
మెగాస్టార్ పుట్టినరోజు..అభిమానులకు పండుగ రోజు..! మెగాస్టార్ తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తరువాత సినిమా చేస్తుండడం...సరిగ్గా ఆ సినిమా షూటింగ్ టైమ్ లో చిరు పుట్టినరోజు రావడంతో అభిమానులు ఈ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. పుట్టినరోజుకి వారం ముందు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో అభిమానులు.... చిరు 150వ చిత్రం సంచలన విజయం సాధించాలని...మెగా ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసారు.
అంతే కాకుండా పుట్టినరోజునాడు చిరుని చూడాలని ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ వచ్చారు. అయితే...చిరును చూద్దాం అనుకున్న వారి ఆశ నిరాశే అయ్యింది. చిరు సిటీలో లేకపోతే ఫంక్షన్ కి రాలేదు అని సరిపెట్టుకోవచ్చు...సిటీలో ఉండి కూడా ఫ్యాన్స్ చేసిన ఫంక్షన్ కి చిరు రాకపోవడం.... సెలబ్రెటీస్ కి ఇచ్చిన ఫంక్షన్ కి మాత్రం చిరు రావడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అభిమానికి చిరు కనిపిస్తే చాలు అప్పటి వరకు పడిన కష్టాన్ని మరచిపోతాడు. కానీ...అలా జరగలేదు. ఒక్క చిరంజీవి అనే కాదు...హీరోలూ... కాస్త ఆలోచించండి..! అభిమానులను అర్ధం చేసుకోండి..!