'వెంకీమామ' లో శ్రియ రావడానికి కారణం...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో వరుణ్ తేజ్‌తో విక్టరీ వెంకటేశ్ చేసిన 'ఎఫ్ 2' వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. కాగా.. వచ్చే ఏడాది జనవరిలో మరో యంగ్ హీరో, తన మేనల్లుడు చైతన్య అక్కినేని కలిసి మరో మల్టీస్టారర్ 'వెంకీమామ' చేయబోతున్నాడు. ఈ సినిమాలో వెంకీ జతగా శ్రియా శరన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి శ్రియనే హీరోయిన్గా తీసుకోవడానికి ప్రధాన కారణం.. ఏంటంటటే, ఇంతకు ముందు సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వెంకటేశ్ హీరోగా శ్రియాశరన్ హీరోయిన్గా ఓ సినిమాను అనుకున్నారు. శ్రియకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అయితే శ్రియ పెళ్లి చేసుకోవడంతో ఆమెను హీరోయిన్గా ఆ సినిమాకు వద్దనుకున్నారు.
తర్వాత ఆ సినిమా ఎందుకనో మధ్యలోనో ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్‌తో ఈ సినిమాలో నటించాల్సిందిగా శ్రియను కోరడం.. అందుకు శ్రియ ఒప్పుకోవడం జరిగిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
బాబీ దర్శకత్వంలో వెంకీమామ తెరకెక్కనుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయట. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com