అమీర్ కు రజనీ అందుకే నో చెప్పాడా..!

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం దంగ‌ల్. నితేశ్ తివారీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. దంగ‌ల్ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఈ భారీ చిత్రాన్ని ఈనెల 23న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. హిందీతో పాటు ప్రాంతీయ భాష‌ల్లో కూడా అనువ‌దించి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.
అయితే...త‌మిళ్ లో త‌న పాత్ర‌కు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డ‌బ్బింగ్ చెబితే బాగుంటుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఆలోచ‌న‌తో అమీర్ ఖాన్ ర‌జ‌నీని క‌లిసి దంగ‌ల్ సినిమా చూపించార‌ట‌. సినిమా చూసిన ర‌జ‌నీకాంత్ సినిమా బాగుంది అని చెప్పార‌ట కానీ...డబ్బింగ్ చెప్ప‌డానికి మాత్రం అంగీక‌రించ‌లేద‌ట‌. ఎందుకంటే... రోబో సీక్వెల్ 2.0లో నెగిటిల్ రోల్ కు ముందుగా అమీర్ ఖాన్ నే అడిగార‌ట కానీ...అమీర్ నో చెప్పాడ‌ట‌. అందుకే ఇప్పుడు ర‌జ‌నీఅమీర్ కి నో చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అది సంగ‌తి..!

More News

నటించడం మానేస్తే ఆయనే ఎక్కువ బాధపడతారు - సమంత..!

నాగ చైతన్య - సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు ఎనౌన్స్ చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.

వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

రవితేజతో మహాలక్ష్మి

హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా పరిచయమైన పంజాబీ భామ మెహరీన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.

శర్వా 'మహానుభావుడు'

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో` శతమానం భవతి` చిత్రంలో నటించాడు.