ఎన్టీఆర్ లైఫ్‌ఫై పూనమ్ ఎందుకిలా ట్వీట్ చేసిందో!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే-20. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక అభిమానుల గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మే మొదటి వారం నుంచే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పుట్టినరోజుకు సంబంధించిన ట్యాగ్స్‌ను తెగ ట్రెండ్ చేశారు. మరోవైపు దర్శకనిర్మాతలు, నటీనటులు ఎన్టీఆర్‌తో తమకున్న సాన్నిహిత్యాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు. వీరిలో చాలా మంది పెద్ద పెద్ద పదాలు వాడి మరీ ఇదీ ఎన్టీఆర్ అంటూ ట్వీట్స్ కూడా చేశారు.
విషెస్ సరే కానీ..
నటి పూనమ్ కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనేక రకాల అంశాలపై స్పందిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజున పూనమ్ చేసిన ఇండైరెక్ట్ ట్వీట్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు పూనమ్ ఎందుకిలా ట్వీట్ చేసిందబ్బా అని కొందరు ఆలోచనలో పడగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎస్ మేడమ్ మీరు చెప్పింది అక్షరాలా నిజమంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విషెస్.. సరే.. ఆయన గురించి చెప్పింది సరే కానీ కనీసం ఆ ట్వీట్ మొత్తమ్మీద ఎన్టీఆర్ పేరు లేకపోవడమే ఇక్కడ అసలు పాయింట్. ఇంతకీ పూనం చేసిన ట్వీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎంతో గౌరవిస్తున్నా..!
‘చిన్నప్పటి నుంచి ఆయన ప్రమేయం ఏ మాత్రం లేకపోయినప్పటికీ పెరిగి పెద్దయ్యేంతవరకూ తిరస్కరణకు గురయ్యాడు. ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ లవ్ సింబల్స్ ఉన్న మూడు ఎమోజీలను పూనం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను పలువురు ఎన్టీఆర్ వీరాభిమానులు, నెటిజన్లు స్పందించారు.
నెటిజన్స్, ఫ్యాన్స్ ఇలా..!
మీరు చెప్పింది అక్షరాలా నిజమే.. ఎన్టీఆర్ చాలా కష్టాలు పడ్డాడు.. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆయన టాలెంట్‌తోనే ఈ స్థాయికి ఎదిగాడని అభిమానులు చెబుతున్నారు. కొందరయితే ఎన్టీఆర్ అని పేరు పెట్టొచ్చుగా మేడమ్ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. ఇంకొందరు మాత్రం ఇంతకీ మీరు ఎన్టీఆర్ గురించే చెబుతున్నారు లేకుంటే ఇంకెవరిని అయినా ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారా..? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసే ట్వీట్ ఏదో డైరెక్టుగా ఎన్టీఆర్ అని పేరు పెట్టి ఆయన లైఫ్‌ఫై చేయాల్సింది..? ఇలా ఎందుకు చేస్తున్నారు..? అని కొందరు పూనమ్‌ను ప్రశ్నిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments