ఆర్జీవీ ప్రెస్‌మీట్‌ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటే...

  • IndiaGlitz, [Sunday,April 28 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టేందుకు యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. నోవాటెల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సిబ్బంది నో చెప్పడంతో హోటల్స్, క్లబ్స్ ఏవీ ఖాళీలేకపోవడంతో ఆఖరికి నడిరోడ్డుపై ప్రెస్‌మీట్ పెట్టేందుకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రబృందం ఫిక్స్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 4గంటలకు ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించింది.

ఆర్జీవీ, రాకేశ్‌రెడ్డితో పాటు చిత్రబృందం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరింది. సమాచారం అందుకున్న పోలీసులు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు..? అరెస్ట్ చేయడానికి కారణాలేంటి..? అనే విషయాలను ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవీ కారణాలు..

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నాయి.

ఇవి అమలులో ఉన్న కారణంగా బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి సభలు, సమావేశాలు పెట్టాలన్నా ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే

రాంగోపాల్ వర్మ ఎంచుకున్న ప్రదేశమైన పైపులరోడ్ నిత్యం హైదరాబాద్ వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా వారు పెట్టుకునే సమావేశం వలన కొన్ని అత్యవర సర్వీసులకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది.

రాం గోపాల్ వర్మ ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ వలన రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది.

ఒకవేళ ఈ కార్యక్రమం బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న కారణంగా ఎవరినన్నా కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా..ఆస్థి, ప్రాణ నష్టం జరిగినా...నిర్వాహకులంతా భాద్యులే.

శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు రాం గోపాల్ వర్మకు అనుమతి ఇవ్వలేదు. ఈ అంశాల కారణంగా రాంగోపాల్ వర్మకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు ప్రకటన జారీ చేశారు.

More News

షాక్ నుంచి ఇంకా తేరుకోలేకున్నా.. సీటు బెల్ట్ వల్ల బతికా!

హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళ్తున్న 'నువ్వు తోపురా' చిత్ర బృందంకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌ మరో విషాదం.. సీనియర్ ఆర్టిస్ట్ మృతి

టాలీవుడ్‌ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ #RRR‌ కు టైటిల్ చెప్పిన కేటీఆర్!

టాలీవుడ్ టాప్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం #RRR. అయితే ఈ ఆర్ఆర్ఆర్‌కు అర్థం ఇంకా చెప్పలేదు.

ద్వివేదీ- జగన్‌ అత్యంత సన్నిహితుడి మధ్య ఏం జరిగింది!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే-23న ఎవరు అసెంబ్లీ, పార్లమెంట్‌కి వెళ్తారో...?

ఫ్లైట్ ఎక్కనంటున్న వర్మ.. వెళ్లిపోవాలంటున్న ఖాకీలు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ విజయవాడలో నడిరోడ్డుపై ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించడంతో రంగంలోకి దిగిన పోలీసులు