వెంకటేష్‌కే.. ఎందుకిలా?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం విజయాల మాట ఎలా ఉన్నా.. ఆయన నటించాల్సిన కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతూ వార్తల్లో నిలుస్తున్నాయి. గడచిన కొంత కాలంగా ఆగిపోయిన వెంకీ సినిమాల జాబితా పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. తాజాగా తేజ దర్శకత్వంలో వెంకీ చేయాల్సిన చిత్రం సెట్స్ పైకి వెళ్ళినట్టే వెళ్లి.. ఆగిపోయిందనే వార్త బయటకు రావడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా తేజ ఈ చిత్రాన్ని వదులుకోవలసి వచ్చిందని టి టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలోనూ ఇలాగే వేరే కారణాల వలన వెంకీ చిత్రాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. మారుతి దర్శకత్వంలో ‘రాధ’ చిత్రం తెరకెక్కాల్సి ఉండగా.. కాపీరైట్ సమస్యల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత వీరి కలయికలో ‘బాబు బంగారం’ సినిమా వచ్చినా.. అది ఆశించినంత విజయం సాధించలేదు. అలాగే.. క్రిష్ డైరెక్షన్‌లో ఒక సినిమా.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రం వేరే వేరే కారణాల వలన ఆగిపోయాయి. ప్రస్తుతం వెంకటేష్.. రెండు మల్టీస్టారర్ మూవీలు చేయబోతున్నారు. ఈ సినిమాలైనా ఏ ఆటంకం లేకుండా సెట్స్ పైకి వెళతాయేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com